మేషం – ముఖ్యమైన అన్ని విషయాల పట్ల జాగ్రత్తగా మెలగడం చెప్పదగినది. చికాకు అసహనం అధికంగా ఉంటాయి. సూత్రప్రాయంగా కొన్ని ఒప్పందాలను కుదుర్చుకుంటారు.
వృషభం – శుభవార్త శ్రవణం చేస్తారు. పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్ పనుల పైన కీలక నిర్ణయాలను తీసుకుంటారు. అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు. ప్రతి విషయాన్ని కీడేంచి మేలెంచమన్న విధంగా చూస్తారు
మిథునం – మీ ప్రయోజనాలు పదిలంగా ఉంటాయి. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా ఉంటాయి. గోప్యంగా కొన్ని పనులు చేపట్టి వాటిని అభివృద్ధి పథంలో నడిపించడానికి సమాయాత్తమవుతారు.
కర్కాటకం – క్రయవిక్రయాలలో స్వల్పమైన లాభాలను అందుకోగలుగుతారు. ఆర్థికస్థితి పైన శ్రద్ధ ఎక్కువగా చూపించవలసి ఉంటుంది.ఊపతాపాలకు దూరంగా ఉండటానికి ఎంత ప్రయత్నించిన విఫలమవుతారు.
సింహం – ముఖ్యమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. జీవిత భాగస్వామితో బేధాభిప్రాయాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి జాగ్రత్త వహించండి. విద్యారంగంలో ప్రోత్సాహం లభిస్తుంది.
కన్య – వ్యాపార పరంగా లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి. పొదుపు పైన దృష్టిని సారించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తారు. ఒకరికి సహాయపడి ఆత్మ సంతృప్తిని పొందుతారు.
తుల – ఆర్థిక వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. నూతన పెట్టుబడులకు అనుకూలమైన కాలం. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.
వృశ్చికం – ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు తీరి మానసిక ప్రశాంతత లభిస్తుంది. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.
ధనుస్సు – ఇంటర్వ్యూలకు హాజరవుతారు.సన్నిహితులతో ఏర్పడిన విభేదాలు తీరతాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కార్యాలయంలో ఉన్నతాధికారుల మెప్పును పొందగలుగుతారు.
మకరం – కుటుంబ సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. నూతన పెట్టుబడులలో తొందరపాటు వద్దు, బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.
కుంభం – క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. నూతన వ్యక్తులు పరిచయమై మాట సహాయం అందిస్తారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. దూరప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందును.
మీనం – కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. జీవిత భాగస్వామి ద్వారా ధన లాభం పొందుతారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. పరిస్థితులకు అనుగుణంగా మీ అభిరుచులను మార్చుకోగలుగుతారు.