మేషం – దైవం మీద భారం వేసి ముఖ్యమైన వ్యవహారాలను సానుకూల పరుచుకోగలుగుతారు. రెండు పడవల మీద ప్రయాణం శ్రేయస్కరం కాదని తెలిసినప్పటికీ, ప్రయోజనాల పరిరక్షణకు ఇటువంటి సాహసాలను చేస్తారు.
వృషభం – శుభకార్యాలు సానుకూల పడతాయి. విదేశాల నుండి విలువైన సమాచారాన్ని అందుకుంటారు. వృత్తి-ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.
మిథునం – చిన్న చిన్న ఆటంకాలు పనులలో ఏర్పడినప్పటికీ,చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏవి ఏర్పడవు. వృత్తి- ఉద్యోగాలపరంగా వ్యక్తిగత గౌరవం మరింతగా పెంపొందుతుంది.
కర్కాటకం – వ్యాపార విస్తరణ కార్యక్రమాలకు గాను మీరు చేసే కృషి ఫలిస్తుంది. జనాకర్షణ ఏర్పడుతుంది. రుణం ఇవ్వడం తీసుకోవడం రెండూ కలిసి రావు.
సింహం – బ్యాంకు రుణాల విషయంలో సాంకేతిక లోపాలు చోటు చేసుకుంటాయి. విభేదాలు తారస్థాయికి చేరుకోకుండా ఆదిలోనే పరిష్కరించుకోండి. వ్యాపార పరంగా స్వల్పమైన అభివృద్ధిని సాధించగలుగుతారు.
కన్య – ఉచిత సలహాలు ఇచ్చేవారు అధికంగా ఉంటారు. కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది.
తుల – కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.వృత్తి- వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం.
వృశ్చికం – సంస్థాపరమైనటువంటి పురోగతిని సాధించడానికి కాను కీలకమైన చర్చలను సాగిస్తారు.విలువైన సమాచారాన్ని తెలుసుకుంటారు.ఆర్థిక అభివృద్ధి కొరకు విశేషమైన కృషి చేస్తారు.
ధనుస్సు – ప్రతి కోణంలోనూ చురుగ్గా వ్యవహరిస్తారు. ప్రతిపనిని క్రమపద్ధతిలో నిర్వహిస్తారు. ధనాని కన్నా వ్యక్తిగత గౌరవానికి అధిక ప్రాముఖ్యతను ఇస్తారు. గతంలో ఒకరికి ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటారు.
మకరం – వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వాన్ని సాధిస్తారు. శుభకార్యాలకు సంబంధించిన చర్చలు పురోగమిస్తాయి. ఊరటను కలిగించే విలువైన సమాచారం అందుకుంటారు.
కుంభం – వివాదాలకు దూరంగా ఉండటం చెప్పదగినది. కీలకమైన వ్యవహారాలలో ఏర్పడిన ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఇతరులకు ఆచరణ సాధ్యం కానటువంటి పనులను కూడా మీరు చేయగలుగుతారు.
మీనం – సొంత నిర్ణయాలకు ప్రాముఖ్యత ఇచ్చి లాభ పడతారు. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.