మేషం – రహస్య చర్చలు రహస్య ప్రయాణాలు తప్పకపోవచ్చు, సాహిత్య కళా రంగాల పట్ల అభిరుచిని కనబరుస్తారు. ఏమాత్రం ఉపయుక్తం లేని అంశాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి.
వృషభం – మీ మీద వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీ యొక్క గుడ్ విల్ రుజువు చేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.
మిథునం – విందు వినోదాల ద్వారా పరిచయాలను విస్తృత పరుచుకోవడానికి గాను అనువైన మార్గాలు లభిస్తాయి. రుణాలు చేయనంత వరకు ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడవు.
కర్కాటకం – భూమి సంబంధమైన వ్యవహారాలు కట్టడాలకు సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. వృత్తి ఉద్యోగాలపరంగా అభివృద్ధి కోసం తీవ్రంగా శ్రమిస్తారు.
సింహం – చిన్నపాటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. ప్రభుత్వ రంగ పరంగా రావలసిన పెండింగ్ బిల్స్ కొలిక్కి వస్తాయి. ఖర్చులు అధికమవుతాయి. నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి.
కన్య – నిరుద్యోగులకు ఉద్యోగం లభించే సూచన గోచరిస్తుంది. మీ శక్తికి మించి కష్టపడతారు. ఫలితాలను కూడా అదే విధంగా సాధిస్తారు. మానసిక ఆనందం కలిగి వుంటారు.
తుల – స్వయంకృతాపరాదాలు పదేపదే చోటు చేసుకోవడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థిక అభివృద్ధి ఆశించిన స్థాయిలో ఉండకపోవడం కొంత ఇబ్బంది కలిగిస్తుంది.
వృశ్చికం – ఆర్థిక వ్యవహారాలు మినహా మిగతా విషయాలు అనుకూలంగానే ఉంటాయి. ఉన్నతాధికారులతో జరిపే చర్చల వలన లాభపడతారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.
ధనుస్సు- చాలా కాలంగా పెండింగ్లో ఉన్న విషయాలను కొలిక్కి తీసుకురాగలుగుతారు. ప్రభుత్వ పరమైన లీజులు, లైసెన్సులు సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలలో సాంకేతిక లోపాలు చోటు చేసుకుంటాయి.
మకరం – రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు సానుకూల పడతాయి. వ్యాపార పరంగా స్వల్ప అభివృద్ధిని సాధించగలుగుతారు. న్యాయబద్ధమైన మీ వాదనలకు పలువురి మద్దతు లభిస్తుంది.
కుంభం – ఆత్మీయులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది తగిన జాగ్రత్త వహించాలి. ప్రజా సంబంధాలను మరింతగా పెంపొందించుకోగలుగుతారు. లిటిగేషన్ వ్యవహారాలు సానుకూలపడతాయి.
మీనం – టీం వర్క్ ను టీమ్ స్ప్రిరిట్ తో పూర్తి చేస్తారు. మీ ఆశయాలను నెరవేర్చుకోవడానికి గాను అరుదైన అవకాశాలు కలిసి వస్తాయి. వృత్తి- వ్యాపారాలలో సానుకూల ఫలితాలను సాధించగలుగుతారు.