Thursday, June 26, 2025

గురువారం రాశి ఫలాలు (26-06-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – నూతన వ్యాపార ప్రారంభం కోసం పెట్టుబడులను అన్వేషిస్తారు. నూతనమైన ఫైనాన్షియల్ స్కీమ్స్ లో సభ్యత్వం తీసుకుంటారు దూరమైన సన్నిహిత వర్గం తిరిగి చేరువవుతారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.

వృషభం –  ఆర్థిక ప్రణాళికలను క్రమపద్ధతిలో రూపొందించుకోగలుగుతారు. విదేశీయత్నాలు కలిసి వస్తాయి. శుభకార్యాలకు గాను ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవును.

మిథునం – ఎందుకో ఏమిటో తెలియని విధంగా ఎదుటివారు మీ మీద విమర్శల వర్షం కురిపిస్తారు. మీ యొక్క  పలుకుబడిని ధనాన్ని ఉపయోగించి కొన్ని సమస్యలను రూపుమాపుకుంటారు.

కర్కాటకం – క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. ప్రజా జీవితంలో మీ స్థాయి మరింతగా పెరుగుతుంది. ఎవరు ఏ సహాయం అడిగినా కాదు అనకుండా సహకరిస్తారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

సింహం – విజయాలు కార్యరూపంలో కనిపించిన అసహనంగా ఉంటారు. మొండిగా వ్యవహరిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంట్లో శుభకార్యాల విషయమై కొద్దిపాటి వాదులాటలు జరిగే సూచన జాగ్రత్త వహించాలి.

కన్య –  సంతాన పురోభివృద్ధి మానసిక ప్రశాంతతకు కారణం అవుతుంది. రచనా వ్యాసంగాల పట్ల మక్కువ  చూపుతారు. నూతన గృహం కొనుగోలు యత్నాలు ప్రారంభిస్తారు.

తుల – ప్రతి విషయంలో చురుగ్గా వ్యవహరిస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ప్రజ్ఞా పాటవాలను కనబరిచి పనులను సానుకూలపరుచుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి.

వ్యశ్చికం – పరపతి కలిగిన వారితోటి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రజా సంబంధాలను విస్తృత పరుచుకుంటారు. మీ ఉన్నతికి ఉపకరించే ప్రతి అంశం పట్ల జాగ్రత్త వహిస్తారు.

ధనుస్సు – ఆర్థిక పురోభివృద్ధిని కొంతవరకైనా సాధించగలుగుతారు. వాయిదా పద్ధతులలో స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. వృత్తి- ఉద్యోగాల పరంగా అధిక శ్రద్దను కనబరుస్తారు.

మకరం – జీవిత భాగస్వామితో సలహాలను సంప్రదింపులను సాగిస్తారు. సకాలంలో అనుకున్న విధంగా పనులను పూర్తి చేయగలుగుతారు. ఆర్థికపరమైన చిక్కుల నుండి పూర్తిగా కాకపోయినా ఒత్తిడి నుండి బయట పడతారు.

కుంభం – ఆత్మవిశ్వాసం, మనోధర్యం పెరుగుతాయి. ఆయాచితంగా కొన్ని శుభ ఫలితాలు చేకూరుతాయి.  పెట్టుబడులు స్థిరాస్తుల వ్యవహారాలు క్రమబద్ధీలో ఉంటాయి. పెద్దల  పట్ల మీ బాధ్యతలను నెరవేరుస్తారు.

మీనం – మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఒకే సమయంలో అనేక కార్యక్రమాలను సానుకూల పరుచుకోవాల్సి రావడం కొంత మానసిక  ఒత్తిడికి గురిచేస్తుంది.

Rasi phalalu cheppandi

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News