- Advertisement -
శ్రీశైలం జలాశయానికి 85 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో జూరాల జలాశయానికి 92వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో జూరాల ప్రాజెక్టు 13 గేట్లను ఎత్తి 51 వేల 779 క్యూసెక్కుల నీటిని వదులుతుండగా విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 32 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. సుంకేసుల బ్యారేజి నుంచి 1334క్యూసెక్కుల నీటిని దిగువ శ్రీశైలంకు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 885 అడుగులకు గాను 860.20 అడుగులకు నీరు చేరింది. 215 టిఎంసీలకు గాను ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 106 టిఎంసీల మేర నీరు నిల్వ ఉంది. ఎగువ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురుస్తుండడంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
- Advertisement -