హైదరాబాద్: ప్రముఖ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ తండ్రి, హాకీ మాజీ ఆటగాడు వేస్ పేస్(80) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. 1945లో గోవాలో వేసే పేస్ జన్మించారు. హాకీలో మిడి ఫీల్డర్‌గా అద్భుతంగా ఆడేవారు. టెన్షన్ మ్యాచ్‌లలో ప్రశాంతంగా వ్యూహాలు రచించడంలో దిట్టగా పేరుంది. 1972లో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి హాకీ జట్టులో సభ్యుడిగా సేవలందించాడు. డాక్టరుగా పని చేస్తూనే హాకీ ఆట ఆడేవాడు. హాకీ క్రీడాకారుడిగా రిటైర్ అయిన తరువాత ఆటగాళ్లకు మెడిసిన్ డాక్టర్‌గా సేవలందించాడు. భారత క్రీడాకారులలో ఒలింపిక్ పతకాలు సాధించిన తండ్రీ కుమారులుగా వేస్ పేస్, లియాండర్ పేస్ రికార్డు సృష్టించారు. 1992లో లియాండర్ పేస్ టెన్సిస్ సింగిల్స్ కాంస్య పతాకం సాధించారు. వేస్ భార్య జెన్నిఫర్ వేస్ భారత మహిళ బాస్కెట్ బాల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు.
లియాండర్ పేస్ తండ్రి కన్నుమూత
- Advertisement -
- Advertisement -
- Advertisement -