Saturday, July 12, 2025

టెన్నిస్ క్రీడాకారిణి రాధికను హత్యచేసిన తండ్రి

- Advertisement -
- Advertisement -

హర్యానా టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్ ను తానే హత్యచేసినట్లు ఆమె తండ్రి దీపక్ యాదవ్ అంగీకరించడంతో కోర్టు ఆయనను ఒకరోజు పోలీసు కస్టడీకి పంపింది. గురుగ్రామ్ లోని తన నివాసంలో రాధిక హత్యకు గురైన మర్నాడు జరిగిన శవపరీక్షలో ఆమెపై నాలుగు సార్లు కాల్పులు జరిగాయని నివేదిక వెల్లడించింది. కాగా, రాధిక యాదవ్ పై మూడు సార్లు కాల్పులు జరిగాయని ఎఫ్‌ఐఆర్ పేర్కొంది. రాధికా యాదవ్ హత్యపై పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం దీపక్ యాదవ్ తన కుమార్తెకు మద్దతు ఇవ్వడమే కాక, ఆమె టెన్నిస్ అకాడమీని ప్రారంబించడానికి రూ. 2 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధపడ్డాడు. టెన్నిస్ అకాడమీ ప్రారంభించడానికి పెట్టుబడి పెట్టడంతో పాటు రాధిక ఒక మ్యూజిక్ వీడియోలో భాగం కావాలని కోరినప్పుడు కూడా మద్దతు ఇచ్చాడు.

అయితే ఈ మధ్య దీపక్ తన స్వగ్రామానికి వెళ్లినప్పుడు అక్కడి కొందరు గ్రామస్తులు అతడు కూతురు చేసే ప్రతిపనికి మద్దతు ఇచ్చిందుకు అతడిని ఎగతాళి చేశారని, గిరా హువా బాప్(బిడ్డకు లొంగిపోయిన తండ్రి) అని గేలి చేయడం అతడికి కోపం తెప్పించిందని అధికారులు తెలిపారు. టెన్నిస్ అకాడమీ నడపవద్దని దాదాపు మూడు రోజులు గొడవ పడిన దీపక్ యాదవ్ కాల్పులకు తెగపడ్డాడు. రాధిక ఇంట్లో అల్పాహారం సిద్ధం చేస్తుండగా ఆమె వెనుక నుంచి ఆమె నడుముపై, వీపు పై దీపక్ యాదవ్ నాలుగుసార్లు కాల్చాడు. తమకు ఆర్థికంగా బలమైన స్థితిలో ఉన్నామని, రాధిక అకాడమీ పెట్టి సంపాదించాల్సిన అవసరం లేదని, అయితే, టెన్నిస్ అకాడమీ వద్దను చెప్పడంతో ఆమె అంగీకరించలేదని, అందువలనే ఆగ్రహం పట్టలేక దారుణానికి పాల్పడినట్లు పోలీసులకు తెలిపాడు.రాధికను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నట్లు తెలిపాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News