అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో జడ్పిటిసి ఉప ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటిసి స్థానాలకు మంగళవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. దీంతో పులివెందుల, ఒంటిమిట్టలో టెన్షన్ టెన్షన్ నెలకొంది. వైసిపి ఎంపి అవినాష్‌రెడ్డిని ముందస్తుగా అరెస్ట్ చేసి కడపకు తరలించారు. అవినాష్‌రెడ్డి అరెస్ట్ ను వైసిపి కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వేంపల్లిలో సతీష్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులపై అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా తనని అరెస్ట్ చేయడం అన్యాయమని మండిపడ్డారు. వైసిపి ఏజెంట్లపై టిడిపి నాయకులు దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దాడులు ఆపాల్సిన పోలీసులే తనను అడ్డుకుంటూన్నారని ఆరోపణలు చేశారు. ఇంత ఆటవీక రాజ్యం తాను ఇప్పుడు చూడలేదన్నారు. బయటి వాళ్లు వచ్చి పులివెందులలో అరాచకాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.