ఢిల్లీ: భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జమ్ముకశ్మీర్ లోని ఎల్‌వొసి వెంట పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. పూంచ్-రాజౌరి, మెంధార్, భింబర్‌గలీలో కాల్పులు మోతమోగుతోంది. కుప్వారాలో పాక్ రేంజర్ల కాల్పులు జరపడంతో భారత్ తిప్పికొడుతోంది. ఆపరేషన్ సింధూర్‌లో కీలక ఉగ్రనేతల హతమయ్యారు. మురిడ్కేలోని మర్కజ్ తయ్యబాపై ఆర్మీ మెరుపుదాడులు చేయడంతో లష్కరే తోయిబా నేత హఫీజ్ అబ్దుల్ మాలిక్ హతమయ్యాడు. మాలిక్‌తో పాటు మరో ఉగ్ర నేత ముదాసిర్ మృతి చెందినట్టు సమాచారం. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాక్ లో వంద మంది ఉగ్రవాదులు మృతి చెందినట్టు సమాచారం. త్రివిధ దళాల అధికారులకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫోన్ చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై త్రివిధ దళాల అధికారులతో రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. పాక్ తీవ్రవాదులపై దాడికి సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు రక్షణశాఖ సమీక్షిస్తోంది.