Thursday, September 18, 2025

కొలంబియాలో ఘోర ప్రమాదం.. 20 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Terrible accident in Colombia 20 people died

బొగోటా: కొలంబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నైరుతి కొలంబియాలోని పాన్‌ అమెరికన్‌ హైవేపై ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన పొగమంచు కారణంగా మూలమలపు వద్ద డ్రైవర్‌ బస్సుపై పట్టు కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News