- Advertisement -
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత ఆర్మీ.. పాక్ లోని ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో విరుచుకుపడింది. మంగళవారం అర్థరాత్రి ఉగ్రస్థావరాలపై భారత సైన్యం బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో భారీగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలోని 10 మందితోపాటు నలుగురు సన్నిహితులు భారత ఆర్మీ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఈ క్రమంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై మసూద్ అజార్ లేఖ విడుదల చేశాడు. భారత ప్రధాని మోడీ అన్ని రకాల యుద్ధ నియామాలు ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. “నాకు భయం లేదు.. నిరాశ లేదు.. విచారం లేదు. భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటా. ప్రధాని మోడీని, భారత్ ను నాశనం చేస్తా” అంటూ లేఖలో పేర్కొన్నాడు.
- Advertisement -