Friday, May 2, 2025

ఇంగ్లండ్‌కు వెళ్లే జట్టులో ఆర్‌సిబి కెప్టెన్‌కి చోటు..?

- Advertisement -
- Advertisement -

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ ముగిసిన తర్వాత భారత్‌.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ తలపడనుంది. అయితే ఈ టూర్‌కి వెళ్లే జట్టులో ఐపిఎల్‌లో రాణిస్తున్న పలువురికి స్థానం దొరికే అవకాశం. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో కెప్టెన్సీలో విఫలమైన.. రోహిత్ శర్మకు సెలక్టర్లు మరో అవకాశం ఇవ్వగా.. షామ్‌లో ఉన్న కరుణ్ నాయర్, ఆర్‌సిబి కెప్టెన్ రజత్ పటిదర్‌కి చోటు దొరికే అవకాశం ఉంది.

ఐపిఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న సాయి సుదర్శన్‌కి కూడా చోటు దక్కొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అతనికి ప్రత్యమ్నాయ ఓపెనర్‌గా ఎంపిక చేస్తారని భావిస్తున్నారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. కుల్దీప్ యాదప్, అక్షర్ పటేల్‌ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపిఎల్ పూర్తి సీజన్‌ని గమనించి.. తుది నిర్ణయం తీసుకోనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News