Thursday, May 8, 2025

నిరంతరంగా ఉచిత విద్యుత్ అందిస్తున్నాం: భట్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఉద్యోగుల అవసరాలు తీర్చడంలో ప్రభుత్వం ముందుంటుందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారని భట్టి చెప్పారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రూ. 7 లక్షల కోట్లు అప్పులు చేసిన ఉద్యోగాలు, జీతాలు ఇవ్వలేదని విమర్శించారు. నిరంతరంగా ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలియజేశారు. రూ. 9 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసంతో నిరుద్యోగులను ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రజలకు సంక్షేమం అందించినట్లే ఉద్యోగులను కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఉద్యోగులను అభ్యసించారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోమని సిఎం విజ్ఞప్తి చేశారని భట్టి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News