మంత్రి పొన్నం ప్రభాకర్‌తో జెఎసి నేతల చర్చలు దీర్ఘకాలిక సమస్యలపై చర్చ సానుకూలంగా
స్పందించిన ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ సమ్మెకు దిగుతామని జెఎసి హెచ్చరిక
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్‌టి సి కార్మికులు బుధవారం నుండి జరుప తలపెట్టి న సమ్మె వాయిదా పడింది. రవాణా శాఖ మం త్రి పొన్నం ప్రభాకర్‌తో ఆర్‌టిసి జెఎసి నేతలు జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా వేస్తున్నట్లు జెఎసి నేతలు ప్రకటించారు. తమ డి మాం డ్లు నేరవేర్చా లని, లేనిపక్షంలో మే 7 నుండి రాష్ట్రవ్యాప్త సమ్మెకు దిగుతామని ఆర్‌టిసి జెఎసి నాయకులు ప్రభుత్వానికి, ఆర్‌టిసి యాజమాన్యానికి నో టీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం సచివాలయంలో సి పిఐ రా ష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాం బశివరా వు, జెఎసి నేతలను మంత్రి పొన్నం ప్ర భాకర్ వద్ద కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మం త్రితో జరిగిన జెఎసి నేతల చర్చల్లో
ఎంఎల్‌సి ప్రొఫెసర్ కోదండరాం, దేవరకద్ర ఎంఎల్‌ఎ జి. మధుసూధన్ రెడ్డి పాల్గొన్నారు. చర్చల సందర్భం గా ఆర్‌టిసి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని జెఎసి నేతలు ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రి సానకూలంగా స్పందించి ఈ సమస్యలన్నింటిని ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరిస్తామ ని, ఆర్‌టిసి శ్రేయస్సు దృష్టా సమ్మె విరమించాల ని కోరడంతో జెఎసి నేతలు సమ్మె వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ జెఎసి నేతలకు ధన్యవాదాలు తెలిపారు. మంత్రితో జరిపిన చర్చల్లో జెఎసి నేతలు ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఎస్. బాబు, డి ప్యూటీ జనరల్ సెక్రటరి పి. అప్పారావు, టిఎం యు అధ్యక్షులు ఎఆర్ రెడ్డి, టిజెఎంయు రాష్ట్ర అధ్యక్షులు డివికె రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కమలాకర్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ జిపిఆర్ రెడ్డి, ఎన్‌ఎంయు నాయకులు వి. బాబు, బికెయు నాయకులు ఎ. రాములు పాల్గొన్నారు.
మళ్లీ సమ్మెకు దిగుతాం
సమ్మె కొంతకాలం వాయిదా వేయాలని నిర్ణయించామని ఆర్‌టిసి జెఎసి ప్రకటించింది. మంత్రితో చర్చలు జరిపిన అనంతరం జెఎసి నేత లు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌టిసి సమ్మెను వాయిదా వేస్తున్నామని, సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ సమ్మెకు దిగుతామని వెల్లడించింది. ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరామని, ప్రైవేటు విద్యుత్ బస్సుల గురించి ప్రభుత్వం సానుకూలం గా స్పందించిందని, ప్రభుత్వమే విద్యుత్ బస్సులు కొని ఆర్‌టిసికి ఇచ్చే లా చర్యలు చేపడతామని అన్నారని, కారుణ్య నియామకాలపై ప్రభు త్వం సానుకూలంగా స్పందించిందని, సింగరేణి మాదిరిగా రెగ్యులర్ ప్రాతిపదికన కారుణ్య నియామకాలు చేపట్టాలని చెప్పామని, విశ్రాంత ఉద్యోగుల బకాయిలపై సానుకూలంగా స్పందించారని తెలిపారు. వేతన సవరణ గురించి సానుకూలంగా స్పందించారని, ప్రభుత్వంలో ఆర్‌టిసి విలీనంపై సుదీర్ఘంగా చర్చించామని అన్నారు.‘సమ్మె కొంతకాలం వాయిదా వేయాలని నిర్ణయించినట్లు జెఎసి నేతలు తెలిపారు. ప్రస్తుతానికి సమ్మెను వాయిదా వేస్తున్నాం, సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ సమ్మెకు దిగుతామని జెఎసి నేతలు చెప్పారు.