- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసి ప్రయాణికుల కోసం మరో బంపరాఫర్ తీసుకువచ్చింది. హైదరాబాద్-విజయవాడ రూట్‌లో రాకపోకలు సాగిచే వాళ్లకు శుభవార్త అందించింది. ఆయా బస్సుల్లో టికెట్ల రేట్లపై భారీ డిస్కౌంట్‌లను ప్రకటించింది. కనిష్ఠంగా 16 శాతం నుంచి గరిష్ఠంగా 30 శాతం వరకూ ఈ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ విషయాన్ని ‘ఎక్స్’ ద్వారా టిజిఎస్ ఆర్టిసి (TGSRTC) వెల్లడించింది.
ఈ డిస్కౌంట్ల ప్రకారం.. గరుడ ప్లస్ బస్సుల్లో టికెట్ ధరలపై 30 శాతం, ఈ గరుడ బస్సుల్లో 26 శాతం, సూపర్ లగ్జరీ, లహరి నాన్ ఎసి బస్సుల్లో 20 శాతం, రాజధాని, లహరి ఎసి బస్సుల్లో 16 శాతం మేర ధరలు తగ్గనున్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బుక్కింగ్‌లకు ఈ రాయితీలు వర్తిస్తాయి. ఈ టికెట్లను ఆర్టిసి (TGSRTC) అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపింది.
- Advertisement -