మన తెలంగాణ/హైదరాబాద్: టిజిఎస్ ఆర్టిసి బస్ పాస్ చార్జీలను పెంచింది. సాధరణ ప్రజల జనరల్ బస్ పాస్‌లతో పాటు వి ద్యార్థులు బస్ పాస్ చార్జీలను సవరించింది. పెంచిన బస్ పాస్ చార్జీలు సోమవారం నుంచే అమలులోకి వచ్చాయి. టోల్ ప్లాజా ఛార్జీలను కూడా ఆర్టిసి సవరించింది. స్టూడెంట్ బస్ పాస్ చా ర్జీలు గత మూడు సంవత్సరాలుగా పెంచలేదని, పెరిగిన ఖర్చుల కారణంగా స్టూడెంట్ బస్ పాస్, సాధారణ ప్రయణికుల నెలవా రీ బస్ పాసుల ఛార్జీలను సవరించినట్లు యాజమాన్యం ప్రకటించింది. రూ. 1150 ఉన్న ఆర్డినరీ బస్ పాస్ ధరను రూ. 1400 లకు పెంచారు. రూ. 1300 ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాస్ ధ రను రూ. 1600 లకు పెంచారు. రూ. 1450 ఉన్న మెట్రో డిల క్స్ పాస్ ను రూ. 1800లకు పెంచారు.
గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఎసి పాస్ ధరలను ఆర్టిసి పెంచింది. హైదరాబాద్, సబర్బన్ ప్రాంతాలలో ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉంటున్నందున సిటీ ఆర్డినరీ బస్సులు ఓవర్‌లోడ్ అవుతున్నాయని, ఈ రద్దీని నివారించడానికి ఇప్పుడు అనుమతిస్తున్న సిటీ ఆర్డినరీ బస్సులతో పాటు హైదరాబాద్ నగరంలోని మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కూడా విద్యార్థులను అనుమతించాలని బస్ పాస్ చార్జీలను పెంచుతూ సంస్థ నిర్ణయించింది. దశాబ్దాలుగా ప్రయాణికులు, విద్యార్థులు ఆర్టీసీని ఎంతగానో ఆదరిస్తున్నారని, సంస్థ తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని, తమ కుటుంబం లాగా భావిస్తూ.. సంస్థకు వెన్నంటి ఉంటూ ప్రోత్సహిస్తున్నారని, ప్రజా రవాణా వ్యవస్థపై ఆదరాభిమానాలు చూపిస్తోన్న వారందరికీ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. బస్ పాస్, టోల్ ప్లాజా యూజర్ ఛార్జీల సవరణను స్వాగతించాలని సంస్థ కోరింది.
టోల్ ప్లాజా యూజర్ జార్జీల సవరణ
నేషనల్ హైవే అథారిటీ ఆప్ ఇండియా ప్రతి ఏటా టోల్ పన్ను సవరిస్తోంది. టోల్ పన్నును సవరించినప్పుడల్లా ప్రయాణీకుల యూజర్ చార్జీలను పెంచుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిసికి అనుమతించింది. ఈ మేరకు టోల్ ప్లాజా యూజర్ చార్జీని సవరించినట్లు సంస్థ ప్రకటించింది. ఈ టోల్ ప్లాజా యూజర్ చార్జీల పెంపు హైదరాబాద్ సిటీ రూట్లలో టోల్ ప్లాజా లేకపోవడం వల్ల ప్రభావం ఉండదు. టోల్ ప్లాజా మీదుగా వెళ్లే ప్రతి ప్రయాణీకుడి నుంచి మాత్రమే అదనంగా ప్రలి టోల్ ప్లాజాకు రూ. 10 సంస్థ వసూలు చేస్తుందని ఆర్టిసి వెల్లడించింది. టోల్ ప్లాజా మీదుగా ప్రయాణించక పోతే ఎలాంటి యూజర్ చార్జీ ఉండదని ప్రకటించింది.
సవరించిన బస్ పాస్ ధరలు :
క్ర.సం. బస్‌పాస్ రకం ప్రస్తుత స్టూడెంట్ బస్ పాస్ టారిఫ్ సవరించిన స్టూడెంట్ బస్ పాస్ టారిఫ్
నెలవారీ రూట్ పాస్‌లు – హైదరాబాద్ / వరంగల్ (సిటీ):
ఎ. 4 కి.మీ వరకు రూ. 150 రూ. 225
బి. 8 కి.మీ. వరకు రూ. 200 రూ. 300
సి. 12 కి.మీ వరకు రూ. 300 రూ. 450
డి. 18 కి.మీ. వరకు రూ. 390 రూ. 585
ఇ. 22 కి.మీ. వరకు రూ. 450 రూ. 675
నెలవారీ రూట్ పాస్‌లు (జిల్లాలు):
ఎ. 5 కిమీల వరకు రూ. 150 రూ. 225
బి. 10 కి.మీ వరకు రూ. 250 రూ. 375
సి. 15 కిమీల వరకు రూ. 300 రూ. 450
డి. 20 కి.మీ. వరకు రూ. 400 రూ. 600
ఇ. 25 కి.మీ. వరకు రూ. 450 రూ. 675
ఎఫ్. 30 కి.మీ. వరకు రూ. 500 రూ. 750
జి. 35 కి.మీ.ల వరకు రూ. 550 రూ. 825
విద్యార్థి జనరల్ బస్ టికెట్ (హైదరాబాద్/ వరంగల్ ):
ఎ. స్టూడెంట్ జనరల్ బస్ టికెట్ (నెలవారీ) రూ. 400 రూ. 600
జనరల్ బస్ టికెట్ నెలవారి బస్ పాసులు
ఎ. జనరల్ బస్ టికెట్ ఆర్డినరీ రూ. 1150 రూ. 1400
బి. జనరల్ బస్ టికెట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ రూ. 1300 రూ. 1600
సి. జనరల్ బస్ టికెట్ మెట్రో డీలక్స్ రూ. 1450 రూ. 1800