థాయ్, కాంబోడియా సైనికుల మధ్య గురువారం తీవ్రస్థాయి ఘర్షణలు జరిగాయి.ఈ ఘటనల్లో కనీసం 11 మంది మృతి చెందారు. వీరిలో ఎక్కువ మంది పౌరులే అని వెల్లడైంది. సరిహద్దుల వెంబడి అనేక చోట్ల ఇరుపక్షాల మధ్య చిన్న పాటి ఆయుధాలు, రాకెట్లతో పరస్పరం దాడులు జరిగాయి, థాయ్‌లాండ్ ఓ దశలో విమానాలతో కూడా బాంబులు కురిపించింది. ఉదయం ఆరంభమైన పరస్పర కాల్పులు తీవ్రతరం కావడంతో థాయ్ గ్రామస్తులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
పలు చోట్ల సహాయక శిబిరాలలో తలదాచుకుంటున్న జనం, గందరగోళం పరిస్థితుల వీడియోలు వెలుగులోకి వచ్చాయి. సరిహద్దు ప్రాంతాలలోని అత్యంత ప్రాచీన పురాతన ఆలయాలు, కట్టడాల గురించి తరచూ సాయుధ ఘర్షణలు జరగడం పరిపాటి అయింది. ప్రత్యేకించి 9వ శతాబ్ధానికి చెంది ప్రీహ్ విహార్ గురించి 500 కిలోమీటర్ల దూరం సరిహద్దుల వెంబడి అప్రకటిత ఘర్షణలు జరగడంతో ఆగ్నేయాసియా ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.