Monday, September 8, 2025

‘ఒజి’ కోసం పెద్ద ప్లాన్ వేసిన తమన్.. లేటెస్ట్ అప్‌డేట్

- Advertisement -
- Advertisement -

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఒజి’. సెప్టెంబర్ 25వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ అప్‌డేట్‌లతో ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తున్నారు. వచ్చిన ప్రతీ అప్‌డేట్ సినిమాపై అంచనాలు మరింత పెంచుతోంది. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman) సినిమా ఓ అప్‌డేట్‌తో సినిమాపై మరో అద్భుతమైన అప్‌డేట్ ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమా కోసం జపాన్ వాయిద్య పరికరం కోటోను ఉపయోగించి బిజిఎం క్రియేట్ చేశారు ధమన్.

తాజాగా ఈ సినిమా కోసం తమన్ (Thaman) క్రేజీ ప్లాన్ వేశారు. లండన్‌లోని అబ్బే రోడ్‌లోని ఓ మ్యూజికల్ స్టూడియోలో సినిమా బిజిఎంను రికార్డు చేస్తున్నామని తమన్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. అది కూడా ఏకంగా 117 మంది సంగీత కళాకారులతో ఈ రికార్డింగ్ చేస్తున్నారు. ‘HungryCheetah’ బిజిఎం అద్భుతంగా వచ్చిందని తమన్ వెల్లడించారు. ఇక సినిమా విషయానికొస్తే.. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. ప్రియాంక మోహన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించగా.. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Also Read : అద్భుతమైన అనుభవాల ప్రయాణం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News