‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ ని ర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్నమరో సూపర్ హిట్ మూవీ తమ్ముడు. నితిన్ (Nitin) హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్ల మ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమ్ముడు సినిమా జూలై 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ శ్రీరామ్ వేణు మాట్లాడుతూ “తమ్ముడు సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో (Family Emotions) పాటు డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ట్రైలర్ లో కథ ఎలా ఉండబోతుందో చెప్పాం. ఈ కథలో హీరోతో పాటు ఐదుగురు లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్, దిత్య ముఖ్యమైన పాత్రలు చేశారు.
హీరోతో పాటు ఐదుగురు పాత్రలు బలంగా ఉంటాయి. విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ క్యారెక్టర్ కథలో ఎలా ప్రయాణిస్తుందో అలా మా మూవీలోనూ ఉంటుంది. కథ ప్రకారమే తమ్ముడు టైటిల్ పెట్టాం. -‘తమ్ముడు’ కథ విని దిల్ రాజు బడ్జెట్ గురించి ఆలోచించకుండా ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. ఈ కథకు నితిన్ బాగుంటాడని తీసుకు న్నాం. ఓ దినపత్రికలో వచ్చిన ఆర్టికల్ స్ఫూర్తితో ‘తమ్ముడు’ కథను సిద్ధం చేసుకున్నా. -లయది ఈ మూవీలో 90 రోజుల క్యారెక్టర్. తను బాగా సపోర్ట్ చేసి మూవీ పూర్తి చేసింది. – మన సినిమాల్లో ఫైట్స్ త్వరగా వచ్చి వెళ్తుంటాయి. మా సినిమాలో ఫైట్స్ ను ఎపిసోడ్స్ ఫీల్ ఉండేలా రూపొందించాం. ఈ ఫైట్ సీక్వెన్సులు బాగుంటాయి. ఒక గర్వం నిలబడటానికి జరిగిన యుద్ధమే తమ్ముడు మూవీ. తమ్ముడు, అక్క సెంటిమెంట్ ప్రధానంగా కథలో ఉన్నా అనేక లేయర్స్ తో మూవీ సాగుతుంది. మా పాప దిత్య ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ మా మూవీకి మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు”అని అన్నారు.