ఈ ఏడాది ‘రాబిన్‌హుడ్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు హీరో నితిన్. అయితే ఈ సినిమా అంతగా సక్సెస్ సాధించలేకపోయింది. కాగా, నితిన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘తమ్ముడు’(Thammudu Trailer). హీరోయిన్ లయ ఈ సినిమాతో వెండితెరపైకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో లయ, నితిన్‌లు అక్కా తమ్ముళ్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. అక్క ఇచ్చిన మాట నిలబెట్టే తమ్ముడి పాత్రలో నితిన్ నటిస్తున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ముఖ్యంగా ఈ ట్రైలర్లో యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. బి అజనీశ్ లోక్‌నాథ్ అందించిన సంగీతం ట్రైలర్‌ని (Thammudu Trailer) మరో రేంజ్‌కి తీసుకెళ్లింది. ఇక ఈ సినిమాలో సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘వకీల్‌సాబ్’ చిత్రం ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలై 4వ తేదీన విడుదల కానుంది.