Tuesday, July 1, 2025

‘థాంక్యూ డియర్’ టీజర్ విడుదల

- Advertisement -
- Advertisement -

మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మాతగా తోట శ్రీకాంత్ కుమార్ రచన, దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం థాంక్యూ డియర్. (Thank you dear) ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా ముఖ్యపాత్రల్లో నటించారు. కాగా సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ (VV Vinayak) ఈ చిత్ర టీజర్‌ను లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వివి వినాయక్ మాట్లాడుతూ రియల్ స్టార్ శ్రీహరి కుటుంబం నుండి వచ్చిన ధనుష్ రఘుముద్రి హీరోగా, హెబ్బా పటేల్, రేఖా నిరోషా హీరోయిన్లుగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న థాంక్యూ డియర్ చిత్రం గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. హీరో ధనుష్ రఘుమూర్తి మాట్లాడుతూ డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్ మా సినిమా టీజర్‌ను లాంచ్ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News