Sunday, June 15, 2025

ఆ డైరెక్టర్ నన్ను ముంబైకి రమ్మన్నాడు..

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం కోర్ట్. ఈ సినిమాను రామ్ జగదీష్ డైరెక్ట్ చేశారు. ఫోక్సో చట్టం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. నాని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో వచ్చిన ఆ!, హిట్ 1, హిట్ 2 వంటి సినిమాల మాదిరిగానే కోర్ట్ సినిమా కూడా మంచి కంటెంట్ మూవీగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో ప్రియదర్శి పులికొండ, సాయికుమార్, శివాజీ లతోపాటు హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించారు. ఇన్ స్టా గ్రామ్ లో రిలీజ్ చేస్తూ శ్రీదేవి హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.ఈ సినిమాలో నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే కోర్టు సినిమా రిలీజ్ తర్వాత ఈ చిన్నది పలు టీవీ షోల్లో, గేమ్ షో లో పాల్గొన్నది. అయితే శ్రీదేవి తనకు బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలిపింది. ఈ చిన్నది మాట్లాడుతూ.. ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తనకు ఆఫర్ ఇచ్చాడని, మరో మ్యూజిక్ డైరెక్టర్ ఒక కవర్ సాంగ్ కోసం తనతో కలిసి పాడాలని చెప్పాడట. అందుకుగాను శ్రీదేవిని ముంబాయికు రావాలని కోరాడు. దీంతో శ్రీదేవి భయపడినట్లు తెలిపింది. షూట్ కోసం ముంబై రావాలని చెప్పడంతో భయపడిపోయానని, శ్రీదేవి చెప్పుకొచ్చింది. ఇక కోర్ట్ సినిమా భారీ విజయం సాధించడంతో ఈ చిన్నదానికి టాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కడుతున్నాయి. శ్రీదేవి ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతూ కోర్టు సినిమాలో నటించడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News