న్యూఢిల్లీ: రిజర్వాయర్ల వద్ద టెలిమెట్రీల ఏర్పాటు, శ్రీశైలం మరమత్తులకు ఎపి ప్రభుత్వం అంగీకరించిందని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అన్నారు (Revanth Reddy). ఎపి సిఎం చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర జల్‌శక్తి మంత్రి సిఆర్ పాటిల్‌తో జరిగిన భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టెలిమెట్రీల ఏర్పాటు శ్రీశైలం వద్ద మరత్తులకు ఎపి అంగీకరించడం తమ గొప్పతనమని సిఎం తెలిపారు. భేటీలో బనకచర్ల గురించి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ఇది అపెక్స్ కమిటీ భేటీ కాదని పేర్కొన్నారు. కృష్ణా జలాల వినియోగంపై నిపుణులు, అధికారులతో త్వరలో కమిటీ ఏర్పాటవుతుందని తెలిపారు. కమిటీ నివేదిక మేరకు తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు. సోమవారంలోగా కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. భేటీలో పాటిల్ జడ్జి తరహా పాత్ర పోషించారని అన్నారు. ఒకరినొకరు అనుమానించుకుంటూ పోతే ముందుకు సాగలేమని తెలిపారు.
వాటికి ఎపి అంగీకరించడం తెలంగాణ ప్రభుత్వ విజయమే: సిఎం
- Advertisement -
- Advertisement -
- Advertisement -