Monday, September 8, 2025

షారుక్ తనయుడి దర్శకత్వంలో రాజమౌళి.. ట్రైలర్‌ చూసేయండి..

- Advertisement -
- Advertisement -

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో కనీసం ఒక్కసారైనా నటించాలని చాలా మంది నటీనటులకు ఉంటుంది. అయితే కొన్నిసార్లు రాజమౌళి పలు సినిమాల్లో అతిథి పాత్రలో నటించారు కూడా. కానీ, ఓ యువ దర్శకుడు తన తొలి ప్రాజెక్టులోనే రాజమౌళిని డైరెక్ట్ చేసే అవకాశం కొట్టేశాడు. అతను మరెవరో కాదు బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్. ఆర్యన్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ సిరీస్ పేరు ‘ది బ్యాడ్స్‌ ఆప్ బాలీవుడ్’ (The Bads Of Bollywood). హిందీ చిత్ర పరిశ్రమ తీరుతెన్నులపై ఈ సిరీస్‌ని రూపొందించారు.

తాజాగా ఈ సిరీస్‌కి (The Bads Of Bollywood) సంబంధించిన ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌తో కలిసి రాజమౌళి ఒక షాట్‌లో కనిపించారు. ఇక ఈ సినిమాలో బాబీ డియోల్, లక్ష్య లల్వాణి, సహేర్ బాంబా, రాఘవ్ జూయల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ట్రైలర్‌లో దిశా పటానీ, కరణ్ జోహార్ తదితరులు అతిథి పాత్రల్లో కనిపించారు. చివర్లో షారుఖ్ ఖాన్ కూడా కనిపించి సందడి చేశారు. ఈ సిరీస్‌ నెలలోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. గౌరీ ఖాన్ సిరీస్‌ని నిర్మించారు.

Also Read : ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ నుంచి రెండో పాట వచ్చేసింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News