ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగకపోతే కొందరికి రోజు గడవద. అయితే, ఇటీవల కాఫీలో నెయ్యిని కలుపుకుని తాగే అలవాటు పెరుగుతోంది. దీనినే “బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ” అని కూడా అంటారు. ఈ కాఫీ తాగడం వల్ల శరీరానికి తాత్కాలిక శక్తి లభించడంతో పాటు, జీవక్రియ వేగంగా జరుగుతుంది. నెయ్యిలో ఉండే కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ (CLA) మొదలైనవి బ్యూటిరేట్ వంటి కొవ్వు ఆమ్లాలు శరీర కొవ్వు తగ్గించడంలో, పేగుల ఆరోగ్యంలో ఎంతో సహాయపడతాయి.
బరువు తగ్గాలనుకునే వారు దీన్ని పరిమితంగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. అయితే, ఇది అధిక కేలరీలతో కూడిన డ్రింక్. అందుకే దీనిని ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. నెయ్యిలో ఉన్న కొవ్వులు శరీరానికి అవసరమైనవి అయినప్పటికీ, అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
నెయ్యి కాఫీ తాగేటప్పుడు నాణ్యత గల నెయ్యిని మాత్రమే ఉపయోగించాలి. డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నవారు, అధిక కొలెస్ట్రాల్ కలిగినవారు, బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారు దీనిని తాగకపోవడం చాలా మంచిది. అలాగే, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవాలి. నెయ్యితో కాఫీ శరీరానికి శక్తిని ఇస్తూ, జీవక్రియను మెరుగుపరుస్తుంది. కానీ, దీన్ని మితంగా తీసుకోవడం ఎంతో ముఖ్యం.