Sunday, June 29, 2025

ధగడ్ ఆగయా.. ‘ది పారడైజ్’ నుంచి క్రేజీ అప్డేట్

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ది పారడైజ్’లో అడుగుపెట్టారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వి సినిమాస్ సుధాకర్ చెరుకూరి ఈ మూవీని భారీగా నిర్మిస్తున్నారు. దసరా బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రం కోసం మరోసారి చేతులు కలిపారు. ఈనెల 21న షూటింగ్ ప్రారంభమైంది. నాని శనివారం సెట్స్‌లో అడుగుపెట్టారు. వారం పాటు సాగిన కీలకమైన చైల్డ్ వుడ్ సన్నివేశాల షూటింగ్ తో సినిమా జర్నీ ప్రారంభమైంది. ఇప్పుడు నాని ఎంట్రీ ఇచ్చారు. ధగడ్ ఆగయా! అంటూ అనౌన్స్‌మెంట్‌తో హీరో లుక్ రిలీజ్ చేశారు. ఈ 40 రోజుల హైదరాబాద్ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంతో కూడిన పవర్‌ఫుల్ సన్నివేశాలు షూట్ చేయనున్నారు.

ప్రత్యేకంగా డిజైన్ చేసిన గ్రాండ్ సెట్స్‌లో షూటింగ్ జరగనుంది. ‘దసరా’ సినిమా పాన్ ఇండియా మూవీగా అదరగొట్టింది. ఇక ‘ది పారడైజ్’ గ్లోబల్ లెవెల్‌కు వెళ్లబోతోంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్‌తో కలిపి 8 భాషలలో విడుదల కానుంది. టైటిల్ పోస్టర్, గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా గ్లింప్స్‌లో ఉన్న పవర్‌ఫుల్ డైలాగ్, విజువల్స్, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్, నాని ఎంట్రీ… ఇవన్నీ సినిమాపై భారీ అంచనాలను సృష్టించాయి. మార్చి 26, 2026న ‘ది పారడైజ్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ మరోసారి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News