Wednesday, August 20, 2025

‘వరల్డ్ ఆఫ్ థామా’ వచ్చేసింది.. భయపెడుతున్న రష్మిక

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా సినిమాలతో మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది కన్నడ సుందరి రష్మిక మందన్నా. గత ఏడాది పుష్ప-2తో, ఈ ఏడాది ఛావా సినిమాలతో గ్రాండ్ సక్సెస్‌ని అందుకుంది ఈ బ్యూటీ. అయితే కేవలం గ్లామరస్ పాత్రలే కాకుండా.. యాక్టింగ్‌కి ప్రాధాన్యత ఉండే రోల్స్ చేస్తుంది రష్మిక. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల్లో థామా (Thama) ఒకటి. బాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ సాధించిన ‘స్త్రీ’ యూనివర్స్‌లో వస్తున్న సినిమా ఇది. తాజాగా ఈ సినిమా టీజర్‌ని ‘వరల్డ్ ఆఫ్ థామా’ పేరుతో విడుదల చేశారు.

ఈ సినిమాలో అయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నారు. అతీంద్రియ శక్తులతో కూడిన రొమాంటిక్ సినిమాగా (Thama) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా భయంకరమైన రోల్‌లో రష్మిక ఈ సినిమాలో కనిపించనుంది. బోల్డ్‌గా కనిపిస్తూనే.. భయపెట్టింది కూడా. ఓ వైపు హారర్ స్టోరీ అనిపిస్తూనే.. ఈ సినిమాలో లవ్‌ స్టోరీ కూడా ఉందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాను దినేశ్ విజయన్, అమర్ కౌశిక్ నిర్మించారు. అదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహించారు. పరేశ్ రావల్, నవాజుద్దీన్ సిద్ధికీ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ ఏడాది దీపావళీ కానుకగా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News