Sunday, August 3, 2025

బోగారం మఠంబావి శివాలయంలో చోరీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కీసరః బోగారంలోని మఠంబావి శివాలయంలో గర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. శనివారం ఉదయం ఆలయ ద్వారాలు తెరిచి ఉండటం గమనించిన కమిటీ సభ్యులు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సుమారు రూ.లక్ష విలువ చేసే వెండి నాగ పడిగె తొడుగు, పార్వతి పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలు, అభరణాలు, ఇతర పూజా సామాగ్రి దుండుగులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కీసర సీఐ ఆంజనేయులు ఆలయాన్ని సందర్శించారు. నిపుణులు ఆలయంలో వేలిముద్రలు సేకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News