మనతెలంగాణ/మునగాల: తాడువాయి తండా గురప్ప స్వామి దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. మండల పరిధిలోని తాడువాయి గ్రామ ఆవాస గ్రామమైన తాడ్వాయి తండాలో ఎంతో చరిత్ర కలిగిన గుర్రప్ప దేవాలయాన్ని ఇటీవలే స్వామి వారి భక్తులు సహకారంతో పునర్నిర్మానం చేసి నూతన విగ్రహావిష్కరణలు ఏర్పాటుచేసి వేద పండితుల మంత్రోత్సవాలతో ఎంతో అంగరంగ వైభవంగా ఆలయంలో ధ్వజస్తంభాని ప్రారంభించారు. ఆలయపున నిర్మాణంలో భాగంగా గ్రామంలో 16 రోజులు భక్తులు గుర్రప్ప మాల ధరించి పూజలు నిర్వహించారు.
ఆలయ అభివృద్ధికి హైదరాబాద్ పట్టణాలతో పాటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం పలు జిల్లాల్లో స్థిరపడిన గురప్ప స్వామి భక్తులు తమకు వచ్చిన విధంగా స్వామి వారికి వెండి కిరీటాలు, కండ్లు, వడ్డానం, నగదును సమర్పించారు. ఆలయానికి ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడం వల్ల బుధవారం రాత్రి కారులో గుర్తు తెలియని వ్యక్తులు సందర్శించి స్వామి వారి వెండి ఆభరణాలు మరియు కానుకల ఉండిని పగలకొట్టి నగదును అపహరించారు. వీటి విలువ సుమారు లక్ష రూపాయలు పైగా ఉంటుందన్నారు. గురువారం ఆలయానికి సంబంధించిన భక్తులు ఆలయంలో చోరీ జరిగిందని గ్రామస్తులకు తెలిపారు. ఆలయంలో చోరీ జరిగినట్లు స్థానిక పోలీసులకు తెలిపారు.