Saturday, September 13, 2025

పట్టపగలే దొంగల చేతివాటం.. బైక్‌ డిక్కీ నుంచి భారీగా నగదు చోరీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. అందరూ చూస్తుండగానే.. ద్విచక్రవాహనం డిక్కీలోంచి నగదును ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. ఎర్వగూడ గ్రామానికి చెందిన ప్రదీప్ గౌడ్ అనే వ్యక్తి శంకర్‌పల్లిలోని (Rangareddy Shankarpally) హనుమాన్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన డ్వాక్రా గ్రూప్‌నకు సంబంధించిన రూ.2.98 లక్షల నగదును యూనియన్ బ్యాంక్‌ను వద్దకు తీసుకెళ్లారు. క్యూలైన్‌ ఎక్కువగా ఉండటంతో వాహనం డిక్కీలో ఉంచి సమీపంలోనే ఉన్న ల్యాబ్‌లోనే పని చేసుకునేందుకు వెళ్లారు.

15 నిమిషాల తర్వాత వచ్చి వాహనం డిక్కీలో చూస్తే నగదు కనిపించలేదు. వెంటనే అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సిసి కెమెరా ఫుటేజీని పరిశీలించారు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు డిక్కీని తెరిచి నగదు తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. (Rangareddy Shankarpally)

Read Also : పాఠశాల భవనంలో మత్తు పదార్థాలు.. నలుగురు అరెస్ట్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News