Tuesday, July 8, 2025

నేరేడు పండ్ల లాభాలు తెలిస్తే వదలరు..

- Advertisement -
- Advertisement -

వేసవికాలంలో లభించే పండ్లలో నేరేడు పండు ఒకటి. ఇందులో విటమిన్ సి, ఐరన్, పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కావున వీటిని తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. ఆయుర్వేదం, ఆధునిక వైద్యం రెండింటిలోనూ దీన్ని ప్రయోజనకరంగా పరిగణిస్తారు.

డయాబెటిస్ ఉన్నవారికి నేరేడు పండ్లు ఎంతో మేలు చేస్తాయి. దీనిలో ఉండే జామున్, జాముసీన్ వంటి రసాయనాలు రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే, ఇందులో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. నేరేడు పండ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో ఉండే విటమిన్ సి, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని వైరస్, బ్యాక్టీరియా నుంచి రక్షిస్తాయి. అలాగే, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

బరువు తగ్గాలనుకునేవారు దీని తినొచ్చు. ఇందులో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉంటుంది. కావున దీన్ని తీసుకున్నప్పుడు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది జీవక్రియను వేగవంతం చేసి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యానికి కూడా నేరేడు ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్ A, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి. ఇది కాలేయాన్ని శుభ్రపరచి ఫ్యాటీ లివర్ వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News