Thursday, July 10, 2025

జీరో క్యాలరీలు ఉండే ఆహారాలు ఇవే..

- Advertisement -
- Advertisement -

నేటి కాలంలో ఊబకాయం అనేది ఒక సాధారణమైన, తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారిపోయింది. ఇది కేవలం బొడ్డు చుట్టూ అధిక కొవ్వుతో అసౌందర్యంగా కనిపించడం మాత్రమే కాదు.. జీవక్రియ లోపాలు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. ఊబకాయాన్ని తగ్గించడానికి కొంతమంది వాకింగ్ చేస్తే, మరికొందరు జిమ్‌కు వెళ్తారు. అయినప్పటికీ సరైన ఫలితం ఉండదు. దీనికి ప్రధాన కారణం.. ఆహారపు అలవాట్లు. ఇలాంటి పరిస్థితుల్లో జీరో క్యాలరీ లేదా తక్కువ కేలరీలు, అధిక పోషక విలువలు కలిగిన ఆహారాలు తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

నిమ్మకాయ నీరు
శరీరాన్ని డిటాక్స్ చేస్తూ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

దోసకాయ
దాదాపు 96% నీటిని కలిగి ఉండే దోసకాయ శరీరాన్ని హైడ్రేట్ చేయడంతో పాటు జీర్ణ వ్యవస్థను శుభ్రంగా ఉంచుతుంది.

బ్రోకలీ
బ్రోకలీ లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండి, తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

నారింజ పండు
నారింజ పండులో విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటాయి. దీంతో వీటిని తీసుకుంటే కడుపున నిండిన భావన కలిగిస్తుంది. దీంతో ఎక్కవ ఆహారం తినకుండా ఉంటాం.

టమోటా
టమోటాలో ఉండే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఆకలిని నియంత్రించడంతో బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.

క్యారెట్
క్యారెట్‌లో అధికంగా ఉండే ఫైబర్ శరీరంలోని కొవ్వును సులభంగా కరిగిస్తుంది. ఇది ఆకలిని తగ్గించి శరీర బరువును నియంత్రిస్తుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News