అందరూ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం పై ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో ఆరోగ్యం పట్ల చాలామంది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో చాలామంది ఆరోగ్యంగా ఉండడానికి కాఫీలు, టీలు తాగడం మానేసి గ్రీన్ టీ తాగడానికి మొగ్గుచూపుతున్నారు. దీనికి ప్రధాన కారణం గ్రీన్ టీ లోని పోషకాలు , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే గ్రీన్ టీ ని తయారు చేసేటప్పుడు ఆకులను ఆక్సీకరణం చేయరు. అయితే గ్రీన్ టీ తీసుకుంటే తొందరగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. గ్రీన్ టీ ఎవరు తాగకూడదో ఇప్పుడు చూద్దాం.
అసిడిటీ, అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీ ని తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గ్రీన్ టీ లో ఉండే టానిన్లు కడుపులో ఆమ్లాలను పెంచుతాయి. దీంతో గుండెల్లో మంట అసిడిటీ, కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.
రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు గ్రీన్ టీ కి ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఎందుకంటే దీనిలో ఉండే టానిన్లు శరీరంలో ఐరన్ శోషణను అడ్డుకుంటాయి. ఈ సమస్య ఉన్నవారు గ్రీన్ టీ ని తాగితే ఐరన్ లోపం మరింత కావచ్చు.
ఈరోజుల్లో నిద్రలేమే సమస్యతో అనేకమంది బాధపడుతున్నారు. ఇలాంటి వారు గ్రీన్ టీ నీ తాగకపోవడమే మంచిది. ఎందుకంటే గ్రీన్ టీం లో ఉండే కెఫిన్ నిద్రలేమి, ఆందోళన, గుండె దడ వంటి సమస్యలకు దారి తీయవచ్చు.
గర్భిణీలు, పాలిచ్చే తల్లులు గ్రీన్ టీ కి దూరంగా ఉండాలి. ఇందులో ఉండే టిఫిన్ ప్లాసెంట ద్వారా శిశువుకు చేరే అవకాశం ఉంటుంది. ఒకవేళ పాలిచ్చే తల్లులు గ్రీన్ టీ ని తాగితే కెఫిన్ పాల ద్వారా పిల్లలకు చేరవచ్చు. అయితే వైద్యుల సలహా మేరకు తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది.
ఇకపోతే, లివర్ సమస్యతో బాధపడుతున్న వారు గ్రీన్ టీ కి ఎంతో దూరంగా ఉండాలి. కొన్ని అధ్యాయనాల ప్రకారం.. అధికంగా గ్రీన్ టీ తీసుకోవడం వల్ల లివర్ పై ప్రభావం చూపుతుంది. యువర్ సమస్య బాధితులు గ్రీన్ టీ తాగే విషయంలో రైతుల సలహా తీసుకోవడం మంచిది.