Wednesday, August 13, 2025

టిటిడి ఉద్యోగి ఇంటిలో చోరీ…

- Advertisement -
- Advertisement -

Thieves stolen gold in TTD Employees House in Tirupati

తిరుపతి: టీటీడీ ఉద్యోగి ఇంటిలో చోరీ జరిగింది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక నగర్, డి టైప్ క్వార్టర్స్ లోని టీటీడీ ఉద్యోగి ఇంటిలో 85 గ్రాముల బంగారం, 1500 గ్రాముల వెండి, 40 వేల నగదును దొంగలు అపహరించారు. పుత్తూరులో బంధువుల పెళ్లికి బుధవారం మధ్యాహ్నం వెళ్లి గురువారం ఉదయం ఇంటికి వచ్చిన బాధితులు…తలుపులు తెరిచి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించి 100కు కాల్ చేశారు. దీంతో అలిపిరి పోలీసులు క్లూస్ టీంతో ఘటనాస్థలానికి  చేరుకుని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అలిపిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Thieves stolen gold in TTD Employees House in Tirupati

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News