ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిన ఇంగ్లండ్ జట్టు ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో భారత్‌ను ఓడించాలని అనుకుంటోంది. జూలై 10వ తేదీ నుంచి లార్డ్స్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు (Ben Stokes) సవాల్ వంటిదని మాజీ ఆటగాడు మైఖేల్ ఆథర్టన్ అభిప్రాయపడ్డారు. ఈ టెస్ట్‌లో అతడు కఠినమైన సవాళ్లు ఎదురుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ టెస్ట్ మ్యాచ్ అతని నాయకత్వ పటిమ, మానసిక, శారీరక సామర్థ్యానికి పెద్ద పరీక్ష అని ఆయన అన్నారు.
రెండో మ్యాచ్‌లో టాస్ సమయంలో పొరపాటు జరిగిందని ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ అంగీకరించారు. దీంతో స్టోక్స్ (Ben Stokes) కెప్టెన్సీ సామర్థ్యంపై అనుమానాలు వచ్చాయి. అయితే రాబోయే రెండు రోజులు స్టోక్స్‌కు చాలా ముఖ్యమని అథర్టన్ అన్నారు. ‘‘మొదటి టెస్ట్, రెండో టెస్ట్ మ్యాచ్‌కి మధ్య ఏడు రోజుల సమయం దొరికింది కానీ, రెండో టెస్ట్, మూడో టెస్ట్‌కి కేవలం మూడు రోజుల సమయమే ఉంది కాబట్టి.. ఆ సమయం స్టోక్స్‌కి ఎంతో ముఖ్యం. ఆ సమయంలోనే తిరిగి పుంజుకోవాలి’’ అని పేర్కొన్నారు. ఇంగ్లండ్ బ్యాటింగ్‌పై విశ్వాసం ఉందని.. సీమ్ దాడిని బలోపేతం చేయాలని.. అందుకు జోష్ టంగ్, బ్రైడన్ కార్స్ స్థానంలో జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించారు.