Wednesday, September 3, 2025

కెసిఆర్ కుటుంబంలో ఇది కొత్త నాటకం : మహేశ్‌కుమార్ గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసినందుకు కవిత తన ఎమ్మెల్సీ పదవికీ, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ప్రెస్‌మీట్ పెట్టి పలు కీలక ఆరోపణలు చేశారు. తాజాగా ఈ విషయంపై టిపిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పందించారు. కెసిఆర్ కుటుంబసభ్యులు అవినీతి సొమ్మును పంచుకొని ఇప్పుడు గొడవ పడుతున్నారని ఆయన అన్నారు. కవిత చెప్పిన మాటలు అన్ని వాస్తవమే అని.. రాష్ట్రంలో పదేళ్ల పాటు యదేశ్ఛగా దోపిడి జరిగిందని పేర్కొన్నారు.

‘‘పంపకాల్లో విబేధాలు వచ్చి ఇప్పుడు బయటపడుతున్నారు. వాళ్ల పార్టీని వాళ్లే లేకుండా చేసుకుంటున్నారు. కవిత కొన్ని రోజులు తన బాణాన్ని కెటిఆర్‌పై ఎక్కుపెట్టారు.. ఇప్పుడు బాణాన్ని హరీశ్‌రావుపై ఎక్కుపెడుతున్నారు. అమెరికా వెళ్లి వచ్చిన తర్వాత కవిత ప్రవర్తనలో మార్పు వచ్చింది. కవిత.. కెసిఆర్ వదిలిన బాణమే అని నా సందేహం. కెసిఆర్ కుటుంబంలో ఇది కొత్త నాటకం’’ అని మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు.

Also Read : రేవంత్ రెడ్డితో హరీష్ రావు కుమ్మక్కు… నాపై కుట్రలు: కవిత

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News