నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డ సంఘటన చోటు చేసుకుంది. పెద్దకొత్తపల్లికి చెందిన పోతినేని చెరువులో గురువారం సాయంత్రం ఈతకు వెళ్లిన చిన్నారులు మృత్యువాత పడ్డారు. అక్కడే గేదెలను మేపుతున్న బాలుడు గమనించి రైతులకు సమాచారం ఇవ్వడంతో వెళ్లి చూడగా గణేష్ రెడ్డి(13), రక్షిత(10), శ్రవణ్(7) ముగ్గురు చిన్నారులు మృతి చెంది ఉన్నారు. విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం ఇ వ్వంతో ఎస్సై సతీష్ సిబ్బందితో వెళ్లి చేపల వేటగాళ్లను చెరువులోకి దించి చిన్నారుల మృతదేహాలను బయటికి తీయించారు. ధర్మారెడ్డి, సునీత కుమారుడైన గణేష్ రెడ్డి, రక్షిత ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో కుటుంబంలోని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదన వర్ణణాతీతంగా మారింది.
అదే గ్రామానికి చెందిన సుధకార్, రాధా దంపతుల రెండవ కుమారుడు శ్రవణ్ మృతి చెం దారు. హైదరాబాద్‌లోని బండ్లగూడ సరస్వతి శిశు మందిర్‌లో గణేష్ రెడ్డి, రక్షి త దంపతుల కుమారులు గణేష్ రెడ్డి ఏడవ తరగతి, రక్షిత 5వ తరగతి చదువుతున్నారు. శ్రవణ్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్నారు. వేసవి సెలవులు కావడంతో గ్రామానికి వచ్చిన చిన్నారులు ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. శ్రవణ్ కుమార్ తల్లి రాధా సుధాకర్‌లు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ధర్మారెడ్డి భార్య సునిత రెండేళ్ల క్రితం చనిపోయింది. కుటుంబంలో ఇద్దరు పిల్లలు చనిపోవడంతో విషాదం నెలకొంది. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు. మృతదేహాలను నాగర్‌కర్నూల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.