Thursday, May 8, 2025

కుప్పకూలిన లిఫ్ట్.. ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్: జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డులో విషాదం చోటు చేసుకుంది. డంపింగ్‌యార్డు నిర్మాణ పనుల్లో లిఫ్ట్ తెగిపడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. డంపింగ్‌యార్డు పవర్‌ప్లాంట్‌లో చిమ్నీ అమరుస్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన ముగ్గురు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సురేశ్ సర్కార్(21), ప్రకాశ్ మండల్(24), అమిత్రాయ్(20)గా గుర్తించారు. ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News