Thursday, May 1, 2025

భూదాన్ పై హైకోర్టుకు ముగ్గురు ఐపిఎస్‌లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : భూదాన్ భూముల వ్యవహారంలో ముగ్గురు ఐపిఎస్‌లు హైకోర్టును ఆశ్రయించా రు. భూదాన్ వ్యవహారంలో సింగిల్ బెంచ్ తీర్పుపై హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లారు. 27 మంది అధికారులకు చెం దిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం విదితమే. సింగిల్ బెంచ్ తీ ర్పుపై ఐపిఎస్‌లు మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా అప్పీల్ దాఖలు చేశారు. కాగా రంగారెడ్డి జిల్లా మ హేశ్వరం మండలం నాగారంలోని సర్వే 182,194, 195లో భూదాన్ భూముల విషయంలో కొంత కాలంగా వివాదం నడు స్తున్న విషయం వితదితమే. ఈ భూముల్లో మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా, సర్ఫానా, సుఖుర్ అక్రమంగా లే అవుట్ చేసి అమ్మకాలు జరిపారు. భూదాన్ భూముల వ్యవహారంపై ఇటీవల హైకోర్టు విచారణ జరిగింది. ఉన్నతాధికారులకు పాత్రపై విచారణ జరిపించాల ని హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. 50 ఏళ్లకుపైగా సాగు చేసుకుంటున్న భూమిని కొందరు అధికారులు కబ్జా చే యాలని చూస్తున్నారని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలానికి చెందిన బిర్ల మల్లేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ఏప్రిల్ 24న విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం ప్రాథమికంగా రికార్డులను పరిశీలిస్తే నాగారంలోని 181, 182, 194, 195 సర్వే నంబర్లలోని భూములు భూదాన్ బోర్డుకు చెందినవని తేలుతోందని స్పష్టం చేశారు. పిటిషన్‌లో ఉన్నత అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో వారి ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. హైకోర్టు తన విచక్షణాధికారంతో సామాజిక ఆస్తి పరిరక్ష ణలో భాగంగా ఈ పిటిషన్‌పై విచారణ ముగిసేదాకా ఆ సర్వే నంబర్లలోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా ఆ భూముల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయరాదని, అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదని ప్రతివాదులను ఆదేశించారు. నవీన్‌మిట్టల్, మహేశ్ భగవత్, డాక్టర్ జ్ఞానముద్ర వంటి 26 మంది కీలక ప్రభుత్వ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో తాజాగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ముగ్గురు ఐపీఎస్ అధికారులు హైకోర్టులో అప్పీలు చేశారు. ఇందులో ఐపిఎస్‌లు మహేష్ భగ వత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వీరు హైకోర్టు సింగల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్‌లో అప్పీల్‌కు వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News