Tuesday, July 8, 2025

ఎలుగుబంటి దాడిలో ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

సిధి (ఎంపీ): మధ్యప్రదేశ్ లోని సిధి జిల్లాలో సంజయ్‌గాంధీ టైగర్ రిజర్వు సమీపాన గ్రామంలో ఎలుగుబంటి దాడికి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు బబ్బూయాదవ్, దీనబంధు సాహు, సంతోష్ యాదవ్ గా గుర్తించారు. సోమవారం తెల్లవారు జామున బస్తువా గ్రామ సమీపాన దట్టమైన అడవిలో ఈ సంఘటన జరిగిందని పోలీస్ ఆఫీసర్ చెప్పారు. ఈ సంఘటనకు ఆగ్రహించిన గ్రామస్థులు కర్రలతో ఎలుగుబంటిని చావమోది చంపేశారని మార్వాస్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ భూపేష్ వయాస్ చెప్పారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. ఈ సంఘటనపై అటవీశాఖ విభాగం అధికారులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News