Wednesday, August 20, 2025

చేపల వేటకు వెళ్లి ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. భువనగిరి, వలిగొండ, మండలాల్లో చేపల వేటకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందడంతో జిల్లాలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. భువనగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం, తాజ్ పూర్ గ్రామానికి చెందిన ఎండి భాషా (52) చేనేటి వాగులో చేపలు పట్టేందుకు తన స్నేహితుడు, భువనగిరి పట్టణానికి చెందిన వెంకటేష్ (53)తో కలిసి చిన్నేటి వాగు వద్దకు వెళ్లారు. అక్కడ వల వేసి చేపలు పట్టేందుకు ప్రయత్నిస్తుండగా వల చిక్కుకుంది. దాన్ని తీసే క్రమంలో ఒకరు వెళ్లగా ప్రమాదవశాత్తు చెక్ డ్యాం నుంచి కింద పడిపోయాడు. అతడిని కాపాడడానికి వెళ్లిన మరో వ్యక్తి సైతం అక్కడే చిక్కుకోగా ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.

గల్లంతైన యువకుని మృతదేహం లభ్యం
యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం, వెలువర్తి బ్రాహ్మణ చెరువు వరద ఉద్ధృతికి చేపల వేటకు వెళ్లి కొట్టుకుపోయిన మోత్కూర్ మండలం, పాలడుగు గ్రామానికి చెందిన శివరాత్రి నవీన్ (25) మృతి చెందాడు. సోమవారం సాయంత్రం నుండి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీం సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టగా మంగళవారం ఉదయం ఘటన స్థలానికి అర కిలోమీటర్ దూరంలో యువకుని మృతదేహం లభ్యమైంది. వెంటనే మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యుగేందర్ తెలిపారు. యువకుని మృతితో పాలడుగు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుని కుటుంభ సభ్యులు బంధువుల శోకసంద్రంలో మునిగిపోయారు. నవీన్ మృతదేహాన్ని బిజెపి మండల అధ్యక్షుడు మధుసూదన్ యాదవ్ సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News