Sunday, August 3, 2025

సచిన్ అందుకోలేని రికార్డును.. ఈ ముగ్గురు సాధించారు..

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ (Ind VS Eng) గెలుపు కోసం పోరాడుతుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను 2-2 తేడాతో సమం చేయాలని గిల్ సేన భావిస్తోంది. అయితే ఈ సిరీస్‌లో కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, ఓపెనర్ కెఎల్ రాహుల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతంగా రాణించారు. రెండో టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి.. గిల్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక కెఎల్ రాహుల్ దాదాపు ప్రతీ మ్యాచ్‌లో రాణిస్తున్నాడు. రవీంద్ర జడేజా విషయానికొస్తే.. మూడో టెస్ట్‌లో జట్టును గెలిపించేందుకు వీరోచిత పోరాటం చేసిన జడ్డూ, నాలుగో టెస్ట్‌లో సెంచరీ సాధించి.. ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించి మ్యాచ్‌ను డ్రా చేశాడు.

అయితే ఈ సిరీస్‌లో (Ind VS Eng) ఈ ముగ్గురు అసాధ్యమైన రికార్డును సాధించారు. ఐదో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో అర్థశతకం పూర్తి చేసుకున్న జడేజా ఈ సిరీస్‌లో మొత్తం కలిపి 500+ పరుగులు చేశాడు. ఇప్పటికే గిల్ 754, కెఎల్ రాహుల్ 532 పరుగులు చేశారు. దీంతో టీం ఇండియా టెస్ట్ చరిత్రలో ముగ్గురు ఆటగాళ్లు 500+ పరుగులు చేయడం ఇదే తొలిసారి. ఇక ఒకే సిరీస్‌లో 500+ పరుగులు చేసిన లిస్ట్‌లో సునీల్ గవాస్కర్ (774) ముందుంన్నారు. ఆ తర్వాతి స్థానంలో గిల్ వచ్చి చేరాడు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో ఒక్కసారి కూడా ఒక సిరీస్‌లో 500+ పరుగులు సాధించలేదు. 2007 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో సచిన్ 493 పరుగులు చేశాడు. ఆయన కెరీర్‌లో ఇదే అత్యధికం. దీంతో సచిన్ సాధించలేని రికార్డును గిల్, జడేజా, రాహుల్‌లు సాధించి శభాష్ అనిపించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News