Wednesday, May 21, 2025

ఎపిలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

ఎపిలో ఘోర రోడ్డు ప్రమాదం  సంభవించింది. రన్నింగ్ కారు టైరు పేలి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చీరాల మండలం వాడరేవులోని మెడికల్ కాలేజీ సమీపంలో చోటు చేసుకుంది. ప్రమాద ఘటనకు సంబంధించిన వివ రాల్లోకి వెళితే గుంటూరు, తెనాలి ప్రాంతానికి చెందిన తొమ్మిది మంది గుంటూరు ఎంబిటిఎస్ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు వాడరేవు సముద్ర స్నానానికి వచ్చి తిరుగు ప్రయాణం అయ్యారు.

తిరుగు ప్రయాణంలో ఇన్నోవా టైరు పేలి వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న రోహిత్ కుమార్ నాయక్ (19), అజయ్ (18) సంఘటనా స్థలంలో దుర్మరణం పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందు తూ కార్తీక్ (24) మృతిచెందారు. తీవ్రగాయాలైన పాసల దేవదత్త (17), కష్టాల శామ్యూల్ (21), కొడమల హోసన్న (20), పసుపులేటి విష్ణు శశాంక్ (17), వట్టికూటి తనుష్ వెంకట నాగ సాయి (19), అచ్యుత ప్రణేష్ (17) చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన వెంటనే చీరాల డిఎస్పీ ఎండి మొయిన్ ఘటనా స్థలానికి చేరుకున్నా రు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News