Tuesday, June 17, 2025

టి-20 క్రికెట్ చరిత్రలో తొలిసారి… ఒకే మ్యాచ్‌లో మూడుసార్లు

- Advertisement -
- Advertisement -

సాధారణంగా టి-20 మ్యాచ్ అంటేనే ఎంతో ఉత్కంఠ ఉంటుంది. అయితే ఒక మ్యాచ్ టై అయి.. సూపర్ ఓవర్‌కి దారి తీస్తే.. ఆ ఉత్కంఠ డబుల్ అవుతుంది. అలాంటి ఒక మ్యాచ్‌లో మూడు సూపర్ ఓవర్‌లు ఉంటే.. ఆ మ్యాచ్ ఎంత ఆసక్తికరంగా ఉంటుందో మాటల్లో చెప్పలేము. అలాంటి ఓ మ్యాచే నేపాల్, నెదర్లాండ్స్ మధ్య జరిగింది. ట్రై సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏకంగా మూడు సూపర్ ఓవర్లు (Three Super Overs) నిర్వహించాల్సి వచ్చింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ లక్ష్య చేధనలో తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో నేపాల్ టెయిల్ ఎండర్ నందన్ యాదవ్ జట్టుకు విజయం అందించేందుకు పోరాటం చేశాడు. ఆఖరి ఓవర్‌లో రెండు బౌండరీలు బాదడంతో స్కోర్స్ సమం అయ్యాడు. ఈ క్రమంలో నిర్వహించిన సూపర్ ఓవర్‌లో ఇరు జట్లు 19 పరుగులు చేయగా,, రెండో సూపర్ ఓవర్‌ నిర్వహించారు. ఇందులోనూ ఇరు జట్లు 17 పరుగులు చేయడంతో ఈ ఓవర్ కూడా టై అయింది. దీంతో మూడో సూపర్ (Three Super Overs) నెదర్లాండ్స్ ఆల్ రౌండర్ జాచ్ లయన్-కాచెర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాలుగు బంతుల్లో రెండు వికెట్లు తీసి కేవలం ఒక పరుగు కూడా ఇవ్వలేదు. ఒక పరుగు లక్ష్యంతో దిగిన నెదర్లాండ్స్ మొదటి బంతికే సిక్స్ కొట్టి విజేతగా నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News