- Advertisement -
కడప: జిల్లాలోని మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వెళ్లిన ఓ మూడేళ్ల బాలికపై(Three Year Old GIrl) అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేశాడు. ప్రొద్దుటూర్‌లోని అమృతనగర్‌కు చెందిన దంపతులు.. వాళ్ల మూడుళ్ల బాలికను(Three Year Old GIrl) వెంటబెట్టుకొని పెళ్లి నిమిత్తం కంబాలదిన్నేకు వెళ్లారు. అయితే మూడేళ్ల బాలిక మండపం బయట ఆడుకుంటుండగా.. ఓ వ్యక్తి అరటిపండు ఇస్తానని చెప్పి అక్కడి నుంచి ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. విషయం బయటపడకూడదని బాలికను హత్య చేశాడు. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు గాలించగా.. ముళ్లపొదల్లో బాలక మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. నిందితుడిని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పటించారు.
- Advertisement -