Monday, July 28, 2025

‘కామాఖ్య’ సినిమా షురూ

- Advertisement -
- Advertisement -

సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న థ్రిల్లింగ్ మూవీ ‘కామాఖ్య’. (kamakhya) మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ ప్రై.లి. బ్యానర్‌పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. సినిమా ప్రారంభోత్సవానికి మాజీ ఎంపి మధుయాష్కీ గౌడ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఈ వేడుకలో మూవీ టీం అందరూ పాల్గొన్నారు. డైరెక్టర్ అభినయ కృష్ణ ఈ సినిమా కోసం మిస్టీరియస్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ (Mysterious thriller elements) యూనిక్ కథని సిద్ధం చేశారు. ఈ చిత్రంలో ఆనంద్, శరణ్య ప్రదీప్,వైష్ణవ్, ధనరాజ్, రాఘవ, ఐశ్వర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News