- Advertisement -
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘థగ్ లైఫ్’ (Thug Life) ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తుండగా, మొదటి రెండు పాటలు మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉన్నాయి. మంగళవారం మేకర్స్ థర్డ్ సింగిల్ ‘ఓ మార’ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఎఆర్ రెహమాన్ కంపోజిషన్ మర్చిపోలేని రైడ్‌ను అందిస్తుంది. ఈ పాట సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా శింబు బోల్డ్ క్యారెక్టర్‌ని చూపిస్తోంది. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించిన థగ్ లైఫ్ జూన్ 5న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం శ్రేష్ట్ మూవీస్ ఎన్ సుధాకర్ రెడ్డి ద్వారా తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
- Advertisement -