ఈ సంవత్సరం భారత సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో థగ్ లైఫ్ ఒకటి. కమల్ హాసన్(Kamal Haasan)హీరోగా, లెజెండరీ ద ర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో న టించిన ఈ సినిమా హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వా రా తెలుగులో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మేకర్స్ మీ డియా మీట్ నిర్వహించారు. మీడియా మీట్‌లో యూనివర్సల్ హీరో కమల్ హా సన్ మాట్లాడుతూ “ఒక దర్శకుడిగా మణిరత్నం నాయకుడు సినిమాతో ఎలా అయితే అందరినీ సర్‌ప్రైజ్ చేశారో.. థగ్ లైఫ్‌తో కూడ ఆయన ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చేయబోతున్నారు. నేను మనసుపెట్టి చేసిన ప్రతి సినిమా గొప్ప వి జయాన్ని సాధించింది. థగ్ లైఫ్ కూడా నేను మనసుపెట్టి చేసిన సినిమా.
‘థగ్ లైఫ్’ నాయకుడు సినిమా కంటే పెద్ద హిట్ అవుతుంది”అని అన్నారు. డైరెక్టర్ మణిరత్నం మాట్లాడుతూ “కమల్‌హాసన్ ‘నాయకుడు’ సినిమా సమయంలో ఎ లా ఉన్నారో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. నేను డైరెక్టర్ కాకముందు నుం చి ఆయన్ని చూస్తున్నాను. ఆయనలో ఏ మార్పు లేదు. ఆయన దర్శకుడు ఏ మనుకుంటున్నాడో దాన్ని అర్థం చేసుకొని సపోర్ట్ చేసే హీరో”అని తెలిపారు. హీరోయిన్ త్రిష మాట్లాడుతూ “ఈ సినిమా ఒక బ్యూటిఫుల్ జర్నీ. నేను నాయ కుడు సినిమా చూస్తూ పెరిగాను. ఇప్పుడు మణిరత్నం, కమలహాసన్‌తో కలిసి వర్క్ చేసే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా అందరిని అలరిస్తుంది”అని పేర్కొన్నారు. నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ట్రైలర్, సాంగ్స్ చూసిన తర్వాత ఈ సినిమా మెగా బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకం కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హీరో శింబు, సుహాసిని, అభిరామి, నాజర్, తనికెళ్ల భరణి, అశోక్ సల్వన్ పాల్గొన్నారు.