Tuesday, September 16, 2025

రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

- Advertisement -
- Advertisement -

Thunder and lightning rains tomorrow

హైదరాబాద్: రాష్ట్రంలో నేడు (ఆదివారం) అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40కి. మీ వేగంతో వీస్తాయని వాతావరణ కేంద్ర సంచాలకులు డాక్టర్ నాగరత్న తెలిపారు. శనివారం తీవ్రవాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ జార్ఖండ్‌ను ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా మీదుగా కేంద్రీకృతమై ఉందని ఆమె వివరించారు. ఇది జార్ఖండ్ ఉత్తర చత్తీస్‌ఘఢ్ మీదుగా కదులుతూ ఉత్తర మధ్యప్రదేశ్ వైపునకు వెళుతూ క్రమంగా బలహీనపడుతుందని ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News