- Advertisement -
యువకుడిపై పెద్దపులి దాడి చేసిన ఘటన ఆంద్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో కలకలం రేపింది. వివరాలలోకి వెళితే.. స్థానికుల సమాచారం మేరకు జిల్లాలోని కొత్తపల్లి మండలం సదరంపెంటలో పులిచర్ల అంకన్న అనే యువకుడిపై సోమవారం రాత్రి పెద్దపులి దాడి చేసింది. బహిర్భూమికని రాత్రి బయటకు వెళ్లిన అంకన్నపై చెట్ల పొదల్లో ఉన్న పెద్దపులి ఒక్కసారిగా దాడి చేసింది. భయాందోళనకు గురైన అంకన్న గట్టిగా కేకలు వేయడంతో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి రావడంతో పెద్దపులి అతన్ని వదిలిపెట్టి పారిపోయింది. పెద్దపులి దాడిలో అంకన్న తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు యువకుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పెద్దపులి దాడి ఘటనతో స్థానిక గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
- Advertisement -